Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అస్సలు తగ్గని పీఎస్​1... రూ. 450 కోట్ల క్లబ్​ దిశగా పయనం

PS1 film eyes Rs 450 crore worldwide
  • రెండు వారాలుగా కొనసాగుతున్న సినిమా ప్రభంజనం
  • ఇప్పటికే 400 కోట్లు దాటిన వసూళ్లు 
  • జర్మనీలోనూ చిత్రానికి అద్భుత స్పందన
దక్షిణాది దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ (పీఎస్1) పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. గత నెల 30న విడుదలైన ఈ చిత్రం వసూళ్లలో దూసుకుపోతోంది. రూ. 450 కోట్ల మార్కును అందుకునేందుకు చేరువైంది. ఈ వారం చివరి నాటికి ఈ హిస్టారికల్ ఫిక్షన్ సినిమా 450 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. పీఎస్1 తమిళ వెర్షన్.. భారత్ తో పాటు అంతర్జాతీయ సర్క్యూట్‌లో సత్తా చాటుతోంది. కానీ, ఇతర భాషల్లో మాత్రం పెద్ద స్పందన కనిపించడం లేదు. అయినా కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. 

చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్‌ను అధిగమించింది. దాంతో, ఈ రెండు వారాల్లో వచ్చిన సినిమాల్లో పొన్నియన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద స్పష్టమైన విజేతగా నిలిచింది. తొలి భాగానికి పెట్టిన పెట్టుబడులను చిత్ర నిర్మాతలు రికవరీ చేసినట్లు సమాచారం. రెండు పార్టులను దాదాపు ఒకే స్ట్రెచ్ లో చిత్రీకరించారు. ఈ లెక్కన రెండో పార్టుకు వచ్చే వసూళ్లతో నిర్మాతలకు లాభాల పంట పడనుంది.  

మరోవైపు ఈ చిత్రానికి జర్మనీలోనూ అద్భుత స్పందన వస్తోందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తెలిపారు. జర్మనీ బాక్స్ ఆఫీస్ వద్ద పది రోజుల్లో నిర్దేశిత థియేటర్లలో ఈ చిత్రం 1.25 కోట్ల వసూళ్లు రాబట్టిందని ట్వీట్ చేశారు. ఈ సినిమా రెండో భాగం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో థియేటర్లలోకి రానుంది.
ps1
ponniyan selvan
box office
collections
450 cr
cinema

More Telugu News